
జీ 5 తెరకెక్కిస్తున్న పులి మేక వెబ్‌సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీనికి కోన వెంకట్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తోంది. ఆ మధ్య హ్యాపీ బర్త్‌డే అంటూ ప్రేక్షకులను పలకరించిన ఆమె త్వరలో కొత్త సినిమాలతో ముందుకు రాబోతోంది. తమిళంలో హీరో అధర్వతో నటిస్తున్న సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. అలాగే జీ 5 తెరకెక్కిస్తున్న పులి మేక వెబ్‌సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీనికి కోన వెంకట్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మరోవైపు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్‌గా మంజునాథ దర్శకత్వంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటిస్తోంది లావణ్య. అలా ఒక తెలుగు మూవీ, ఒక తమిళ చిత్రం, మరొక వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇవి కాకుండా మరో రెండు కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేయనుందట లావణ్య త్రిపాఠి.
చదవండి: చిరంజీవికి పెళ్లి పత్రిక ఇచ్చిన అలీ దంపతులు
పెళ్లిపీటలెక్కబోతున్న నాగశౌర్య