ఓ లెజెండ్‌ని కోల్పోయాం.. కృష్ణంరాజు మృతిపై అల్లు అర్జున్‌ దిగ్భ్రాంతి

Krinam Raju Paases Away: Allu Arjun And Nani Condolece - Sakshi

సీనియర్‌ నటుడు కృష్ణంరాజు(83) మరణం పట్ల అల్లు అర్జున్‌ దిగ్భ్రాంతి వ్యకం చేశారు. ఆయన మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్‌ అయ్యానని, టాలీవుడ్‌ ఓ లెజెండ్‌ని కోల్పోయిందన్నారు. ‘ కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు.  మరో వైపు  హీరో నాని కూడా కృష్ణంరాజు మృతిపై  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

 ‘అద్భుతమైన జ్ఞాపకాలు పంచినందుకు ధన్యవాదాలు సార్. మీతో కలసి నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.  కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి.  ప్రభాస్‌ అన్న , ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని నాని ట్వీట్‌ చేశారు. కాగా, నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top