
తెలుగింటికి చెందిన కోమలి ప్రసాద్ ( Komalee Prasad) తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆమె దర్శించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

డాక్టర్ నుంచి యాక్టర్‌గా మారిని ఈ బ్యూటీ తాజాగా హిట్ 3 సినిమాతో పాపులారిటీ పెంచుకుంది. ఇక త్వరలోనే ‘శశివదనే’ చిత్రంతో తెరపైకి రాబోతుంది. వైజాగ్‌కు చెందిన కోమలి ప్రసాద్‌లో నటి మాత్రమే కాకుండా జాతీయస్థాయి అథ్లెట్, క్లాసికల్ నృత్య కళాకారిణి అంటూ పలు రంగాల్లో ప్రతిభ కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈమె రాష్ట్ర స్థాయి కోకో క్రీడాకారిణి. బ్యాడ్మింటన్ కళాకారిణి కూడా. విశ్వవిద్యాలయం స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణి.
ఇప్పటికే తెలుగులో నెపోలియన్,హిట్2, రౌడీ బాయ్స్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి వంటి పలు చిత్రాల్లో నటించిన కోమలి ప్రసాద్ హిట్–3 చిత్రంలో ఏఎస్పీ వర్షాగా చాలా కీలక పాత్రలో నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఈపాత్ర కోసం జాతీయస్థాయి బాక్సర్ అనిల్ వద్ద శిక్షణ పొందారు.