KGF Chapter 2 Movie Box Office Collections Day 5, Deets Inside - Sakshi
Sakshi News home page

KGF 2 Box Office Collections: కేజీయఫ్‌ 2 కలెక్షన్ల సునామీ..‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డుపై కన్ను

Apr 19 2022 5:02 PM | Updated on Apr 19 2022 5:59 PM

KGF Chapter 2 Box Office Collection Day 5 - Sakshi

రాకీ భాయ్‌ తీసుకొచ్చిన కేజీయఫ్‌ 2 తుపాన్‌కు ఇండియన్‌ బాక్సాఫీస్‌ పీస్‌ పీస్‌ అవుతోంది. భారతీయ చరిత్రలోనే ఏ సినిమా కొల్లగొట్టని వసూళ్లను రాకీ భాయ్‌ కొట్లగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు రోజుల్లో 625 కోట్ల రూపాయలను వసూలు.. సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్క ఐదో రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.73.29 కోట్లను వసూళ్లు చేయడం గమనార్హం.

పేరుకు కన్నడ సినిమానే అయినా.. హిందీ ఇండస్ట్రీలోనూ రికార్డులన్నింటిని బద్దలు కొడుతోంది కేజీయఫ్‌2. అక్కడ అత్యంత వేగంగా 100 కోట్లు, అంతకంటే వేగంగా ఐదు రోజుల్లోనే రూ.219.6 కోట్లను రాబట్టి సౌత్‌ సినిమాల సత్తా ఏంటో నిరూపించింది. కేజీయఫ్‌ 2 స్పీడ్‌ ఇదే విధంగా కొనసాగితే మాత్రం.. బాహుబలి2 రికార్డు(రూ.500 కోట్ల వసూళ్లు)ను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

టాలీవుడ్‌లో  తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్‌ సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో రూ.58.6 కోట్లను రాబట్టింది. ఐదు రోజుల్లోనే ఓ డబ్బింగ్‌ మూవీ టాలీవుడ్‌లో రూ.58 కోట్ల షేర్‌ రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు  రజనీకాంత్‌ ‘రోబో’పేరిట ఉండేది. టాలీవుడ్‌లో ఈ మూవీకి రూ. 74 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ. 75 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాల్సి ఉంది. కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర ఇలాగే కొనసాగితే మాత్రం కేజీయఫ్ 2 ఆర్ ఆర్ ఆర్  వెయ్యి కోట్ల రికార్డ్ ను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement