Keerthi Suresh: ముంబైలో కీర్తి సందడి.. కల్లు తాగుతూ రచ్చ! షాకింగ్ వీడియో..

‘మహానటి’ కీర్తి సురేశ్ ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో నాని హీరోగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన దసరా మార్చి 30న ఘనంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం దేశంలోని పలు నగరాలను పర్యటిస్తోంది. ఈ క్రమంలో ముంబైలో నిర్వహించిన ప్రమోషన్స్‌లో నాని, కీర్తి సురేశ్, ఇతర మూవీ టీం సభ్యులతో పాటు స్పెషల్ గెస్ట్‌గా రానా దగ్గుబాటి హాజరయ్యాడు.
చదవండి: అప్పుడు సో కాల్డ్ అంటూ కామెంట్స్.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్..
ఇదిలా ఉంటే ఈ ముంబైలోని ప్రమోషన్స్ ఈవెంట్స్ హీరోయిన్ కీర్తి కల్లు తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేతితో పట్టుకోకుండా ఎత్తిన బాటిల్‌ను దించకుండ తాగి అక్కడి వారందరికి షాకిచ్చింది. కీర్తిని అలా చూసి హీరో రానా-నాని అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కాగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో నాని ఊరమాస్ లుక్‌లో కనిపంచనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు సీన్లలో నిజంగానే తాగి నటించినట్లు నాని వెల్లడించాడు. ఏకంగా ఓ సీన్లలో అయితే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండ తాగానని ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు.
చదవండి: జూనియర్‌తో శ్రీదేవి కూతురు జాన్వీ.. ముఖ్య అతిథిగా జక్కన్న.. ఫొటో వైరల్
ఈ క్రమంలో ముంబై ప్రమోషన్స్‌లో భాగంగా హీరోలు నాని, రానాలతో పాటు కీర్తికి కూడా కళ్లు తాగే టాస్క్ ఇచ్చారు హోస్ట్. ఇందులో భాగంగా కీర్తి గుటుక్కున కళ్లు బాటిల్ ఎత్తేసింది. కాగా ‘మహానటి’లో సంప్రదాయంగా కనిపించిన కీర్తి ఈ మధ్య సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫుల్ గ్లామర్ షో చేస్తోంది. ఫొటో షూట్స్‌లో అందాల ప్రదర్శన చేస్తూ తరచూ ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. కీర్తి ఇలా చూసి ఫ్యాన్స్ అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. కీర్తికి ఏమైంది.. ఇలా రెచ్చిపోతుందంటూ తన పోస్ట్స్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
#DhoomDhaam storm in Mumbai as the crazy trio @NameisNani, @KeerthyOfficial & @RanaDaggubati recreate the hookstep of the Mass Song ❤️💃🏾#DhoomDhaam video song out today at 5:04 PM 🔥#Dasara #DasaraOnMarch30th@odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/1E7Q1qGJhm
— SLV Cinemas (@SLVCinemasOffl) March 22, 2023
మరిన్ని వార్తలు :