Karan Johar Praises Rana Daggubati, Sai Pallavi Virata Parvam Movie Trailer - Sakshi
Sakshi News home page

Karan Johar: ‘విరాట పర్వం’ ట్రైలర్‌పై కరణ్‌ జోహార్‌ స్పందన, ఏమన్నాడంటే

Jun 8 2022 10:59 AM | Updated on Jun 8 2022 11:30 AM

Karan Johar Praises Rana, Sai Pallavi Virata Parvam Movie Trailer - Sakshi

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ  నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం ఇటీవల మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆదివారం (జూన్‌ 5న) రిలీజైన విరాట పర్వం ట్రైలర్‌ అందరి బాగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. యుద్ధం మధ్యలో ప్రేమకథ అనే కాన్సెప్ట్ కట్టిపడేసేలా అనిపిస్తోంది.

చదవండి: లారెన్స్‌ భిష్ణోయ్‌ తెలుసు కానీ, గోల్డీ ఎవరో తెలియదు: సల్మాన్‌

దీంతో ఈ ట్రైలర్‌పై పలువురు సినీ స్టార్స్‌ స్పందిస్తూ తమ స్పందనను తెలుపుతున్నారు. అలాగే బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ సైతం ట్రైలర్‌పై స్పందించాడు. విరాట పర్వం ట్రైలర్‌ విడుదల చేసినట్లు రానా ట్వీట్‌ చేయగా.. ఈ ట్రైలర్‌ తనని బాగా ఆకట్టుకుందని, సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ రానా ట్వీట్‌కు రీట్వీట్‌ చేశాడు కరణ్‌ జోహార్‌. ‘ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది రానా. సినిమాను చూడడానికి ఎదురుచూస్తున్నాను. నువ్వు సూపర్. ఇంక నేను సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

చదవండి: అర్జున్‌ కపూర్‌ బాడీ షేప్‌పై ట్రోల్స్‌, ఘాటుగా స్పందించిన లవ్‌బర్డ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement