కాజల్‌ హల్దీ వేడుక: కొడుకుతో కలిసి నిషా డ్యాన్స్‌

Kajal Aggarwal And Nisha Aggarwal Dance In Haldi Ceremony - Sakshi

ముంబై: టాలీవుడ్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్‌- గౌతమ్ కిచ్లులు ఏడడుగుల బంధంతో ఈ రోజు ఒకటికానున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహా మహోత్సవ వేడుక శనివారం(అక్టోబర్‌ 30)న ముంబై జరగునుంది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా కాజల్‌ ఇంట మెహందీ, హాల్ది వేడుకలతో పెళ్లి సందడి మొదలైంది. ఈ క్రమంలో నిన్న జరిగిన హల్ది ఫంక్షన్‌ ఫొటోలు, వీడియోలు నెట్టింటా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీనికి ఎల్లో కలర్‌ హార్ట్‌ ఎమోజీతో కాజ్‌గౌట్‌కిట్స్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది. (చదవండి: కాజ‌ల్ ప్రేమ క‌థ త‌నే చెప్తుంది: నిషా)

ఈ వీడియోలు, ఫొటోలు నెటిజన్‌లను, ఆమె‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. పసుపు రంగు దుస్తులు, పూల ఆభరాణాలతో కాజల్‌ మెరిసిపోగా.. తన సోదరి, నటి నిషా అగర్వాల్‌ గోల్డ్‌ కలర్‌ దుస్తులు ధరించి తన కుమారుడిన ఎత్తుకుని కాజల్‌తో పాటు డ్యాన్స్‌ చేస్తూ ఫంక్షన్‌లో సందడి చేస్తుంది. ఈ కార్యక్రమంలో నిషా సందడి చేస్తూనే అటూ అతిథులను ఆహ్వానిస్తూ బీజీ బిజీగా ఉంది. చివరగా తన కుమారుడు  ఇషాన్‌ వలేచాతో కలిసి గౌతమ్‌ కిచ్లు ఫ్యామిలీని డ్యాన్స్‌ చేసేందుకు ఆహ్వానిస్తూ కనిపించింది. ఇక మరో వీడియోలో, కాజల్ కూడా ప్రముఖ బాలీవుడ్ పాటలు డ్యాన్స్‌ చేస్తున్న ఈ వీడియోలకు ఆమె అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. (చదవండి: మెహందీ వేడుక అయిపోంది.. ఇవాళ హల్ది ఫంక్షన్‌) 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top