Jr NTR Singing Song In RRR Movie, Rumours Goes Viral In Social Media - Sakshi
Sakshi News home page

Jr NTR Song In RRR: క్రేజీ రూమర్‌.. ఆనందంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌!

Published Tue, Nov 23 2021 1:38 PM

Jr NTR Sing A Song For RRR Movie, Rumors Goes Viral - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌లో చాలా సర్‌ప్రైజెస్‌ ఉన్నాయట. కానీ రాజమౌళి దాస్తున్నాడట. రిలీజ్ టైమ్ వరకు ఒక్కో సర్ ప్రైజ్ ను రివీల్ చేస్తూ వస్తాడట. త్వరలో మూడో సింగిల్ రిలీజ్ కాబోతోంది.ఈ టైమ్ లో  ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎన్టీఆర్ గొంతు స‌వ‌రించుకున్నాడ‌ని అంటున్నారు.

యమదొంగ, కంత్రీ, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో లాంటి చిత్రాల్లో తారక్ గొంతు వినిపించింది. ఎన్టీఆర్‌ పాడిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. తన సినిమాల్లోనే కాకుండా పునీత్ రాజ్ కుమార్ నటించిన కన్నడ సినిమా ‘చక్రవ్యూహా’లో కూడా ఎన్టీఆర్‌ ఓ పాట ఆలపించాడు. కొంత గ్యాప్ తర్వాత తారక్ మళ్లీ గొంతుసవరించారట. ఆర్‌ఆర్‌ఆర్‌లో ఒక పాట పాడాడు అని టాక్ వినిపిస్తోంది.

గాయకుడిగా ఎన్టీఆర్ కు మంచి ప్రతిభే ఉంది. అందుకే ఈ చిత్రంలో కీరవాణి, ఎన్టీఆర్ చేత ఒక పాట పాడించారట. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఇక ఇదే కనుక నిజమైతే ఈ సినిమా హైప్ మరో రేంజ్ కి వెళ్ళిపోతుంది. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది.

Advertisement
Advertisement