ట్రెండ్‌ సెట్టర్‌ 'పోకిరి'ని మిస్‌ చేసుకున్న హీరోయిన్స్‌ వీళ్లే! | Sakshi
Sakshi News home page

Pokiri: మహేశ్‌బాబు బ్లాక్‌బస్టర్‌ మూవీ 'పోకిరి' ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసిన హీరోయిన్స్‌

Published Thu, Apr 28 2022 12:32 PM

Ileana Was Not First Choice For Mahesh Babu Pokiri Movie, Know Details Inside - Sakshi

'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతుందో, ఆడే పండుగాడు..' ఈ డైలాగ్‌ వినగానే బుర్రలో పోకిరి సినిమా గిర్రున తిరుగుతుంది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. పలు కేంద్రాల్లో 100 రోజులు విజయవంతంగా నడిచి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమా వచ్చి నేటికి 16 ఏళ్లు నిండాయి. 2006 ఏప్రిల్‌ 28న విడుదలైంది పోకిరి. మహేశ్‌ యాక్టింగ్‌కు, ఇలియానా అందాలకు, పూరీ డైరెక్షన్‌ మార్క్‌కు థియేటర్లలో విజిల్స్‌ మార్మోగిపోయాయి. అయితే ఇండస్ట్రీలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఛాన్స్‌ మొదటగా ఇలియానాకు రాలేదు.

పూరీ జగన్నాథ్‌ పోకిరి కోసం మొదటగా బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ను సంప్రదించాడు. కానీ అప్పటికే ఆమె హిందీలో 'గ్యాంగ్‌స్టర్‌: ఎ లవ్‌ స్టోరీ' సినిమాకు సంతకం చేయడంతో పోకిరి చేయలేనని చెప్పేసింది. అలా ఆమె చేతిలో నుంచి సువర్ణ అవకాశం చేజారిపోయింది. విశేషమేంటంటే పోకిరి, గ్యాంగ్‌స్టర్‌ రెండూ ఒకేసారి రిలీజయ్యాయి. పోకిరి ఇక్కడ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడితే గ్యాంగ్‌స్టర్‌ మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది.

చదవండి: దీపికాకు అరుదైన గౌరవం, జ్యూరీ మెంబర్‌గా మన హీరోయిన్‌!

కంగనా తర్వాత పోకిరి ఛాన్స్‌ ఆయేషా టకియా, పార్వతి మెల్టన్‌, దీపికా పదుకొణెలకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ వీళ్లెవరూ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్పి చేజేతులా గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నారు. అలా ఈ బంపరాఫర్‌ గోవా బ్యూటీ ఇలియానా చేజిక్కించుకుంది. ఇక పోకిరి సినిమాలో ఆమె అందం, యాక్టింగ్‌తో ఎలా రెచ్చిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

చదవండి: ఆడిషన్స్‌కు వెళ్తే రిజెక్ట్‌ చేశారు, అదే నా లక్ష్యం

Advertisement
 
Advertisement
 
Advertisement