సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న ఇలియానా! | Buzz: Ileana Dcruz Plans To Quit Acting? Rumours Trending On Social Media - Sakshi
Sakshi News home page

Ileana D'Cruz: సినిమాలకు హీరోయిన్‌ గుడ్‌బై? విదేశాల్లో సెటిల్‌ కానుందా?

Published Thu, Nov 30 2023 12:01 PM | Last Updated on Thu, Nov 30 2023 12:38 PM

Buzz: Ileana Dcruz Plans to Quit Acting? - Sakshi

ఆగస్టులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందీ బ్యూటీ. బాబు ఆలనాపాలనా చూసుకుంటున్న బ్యూటీ సినిమాలకు గుడ్‌బై చెప్పనుందంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. మా

దేవదాసు సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలుపెట్టింది ఇలియానా. సన్నజాజి తీగలా ఉండటంతో ఈమెకు బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. పోకిరి, జల్సా, కిక్‌, జులాయి.. ఇలా ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించింది. బర్ఫీ మూవీతో హిందీ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌కు దూరమైంది. ప్రస్తుతం ఆమె నటించిన అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, లవర్స్‌ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. 

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ!
ఇదిలా ఉంటే ఇలియానా.. మైఖేల్‌ డోలన్‌ అనే వ్యక్తిని రహస్యంగా పెళ్లాడిందని, ఈ ఏడాది మే నెలలో వీరి పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. ఆగస్టులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందీ బ్యూటీ. బాబు ఆలనాపాలనా చూసుకుంటున్న బ్యూటీ సినిమాలకు గుడ్‌బై చెప్పనుందంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. మాతృత్వాన్ని ఎంజాయ్‌ చేస్తున్న ఇలియానా సినిమాలపై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదట.

నిజంగానే గుడ్‌బై చెప్పనుందా?
అందువల్ల ప్రస్తుతం తాను ఏ సినిమా ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పడం లేదని, భర్త, పిల్లాడితో అమెరికాలో సెటిల్‌ అవ్వాలనుకుంటున్నట్లు టాక్‌ నడుస్తోంది. మరి ఇలియానా నిజంగానే సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా? లేదంటే పిల్లాడు పెద్దయ్యేంతవకు మాత్రమే ఇండస్ట్రీకి దూరంగా ఉండాలనుకుంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.

చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు.. వీడియో చూశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement