రక్తంతో తడిసిన హృతిక్‌ రోషన్‌.. బర్త్‌డే స్పెషల్‌ ట్రీట్‌ | Hrithik Roshan First Look As Vedha Out From Vikram Vedha | Sakshi
Sakshi News home page

Hrithik Roshan: రక్తంతో తడిసిన హృతిక్‌ రోషన్‌.. బర్త్‌డే స్పెషల్‌ ట్రీట్‌

Jan 10 2022 5:09 PM | Updated on Jan 10 2022 5:09 PM

Hrithik Roshan First Look As Vedha Out From Vikram Vedha - Sakshi

Hrithik Roshan First Look As Vedha Out From Vikram Vedha: తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి, మాధవన్‌ కలిసి నటించిన చిత్రం సూపర్ హిట్‌ చిత్రం 'విక్రమ్‌ వేద'. ఈ సినిమాకు అశేష ప్రేక్షధారణ లభించిన సంగతి తెలిసిందే. అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈచిత్రాన్ని హిందీలో రీమెక్ చేస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి నటించిన వేద పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో, గ్రీక్‌ గాడ్‌గా పేరొందిన హృతిక్‌ రోషన్‌ అలరించనున్నాడని సమాచారం. జనవరి 10న హృతిక్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్‌. 'విక్రమ్‌ వేద' హీందీ రీమెక్‌ నుంచి హృతిక్‌ రోషన్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. 

ఈ ఫస్ట్ లుక్‌లో హృతిక్‌ రఫ్‌ లుక్‌లో అట్రాక్టీవ్‌గా కనిపిస్తున్నాడు. నల్లని కళ్లద్దాలు, గడ్డం, నల్లటి కుర్తాలో రక్తంతో తడిసిన 'వేద' పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను తమిళలో రూపొందించిన దర్శకుడు పుష్కర్‌ గాయత్రి ఈ హిందీ రీమెక్‌కు డైరెక్షన్‌ చేయనున్నాడు. ఈ సినిమాలో మాధవన్‌ నటించిన విక్రమ్‌ రోల్‌లో సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నాడు. ఇప్పటివరకు సైఫ్‌ ఫస్ట్‌ లుక్‌ ఇంకా రాలేదు. అయితే ఇవాళ హృతిక్‌ బర్త్‌డే స్పెషల్‌ ట్రీట్‌గా వెద ఫస్ట్‌ లుక్‌ను రివీల్‌ చేశారు మేకర్స్‌. ఇందులో రాధికా ఆప్టే కూడా కీలక పాత్రలో మెరవనుంది.  
 

ఇదీ చదవండి: నోట్లో థర్మామీటర్‌తో జాన్వీ.. కరోనాగా అనుమానం

Advertisement
 
Advertisement
Advertisement