
ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత సాక్షిగా’. చేతన్ రాజ్ కథ అందించి, నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ మూవీ ట్రైలర్‌ని దర్శకుడు విజయ్ కనకమేడల, నిర్మాత సతీష్ వేగేశ్న విడుదల చేశారు. ‘‘ఈ మధ్య తెలుగు ప్రేక్షక దేవుళ్లు కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. అలాంటి వారికి మా ‘గీత సాక్షిగా’ నచ్చుతుంది’’ అన్నారు ఆదర్శ్.
‘‘మహిళా సమస్యలపై రూపొందిన చిత్రం ఇది’’ అన్నారు చిత్రా శుక్ల. ‘‘మన దేశంలో మహిళలను అమ్మగా పూజస్తాం. అలాంటి వారిపై సమాజంలో జరుగుతున్న దురాగతాల నేపథ్యంలో ఈ సినిమా తీశాం’’ అన్నారు చేతన్ రాజ్. ‘‘వాస్తవ ఘటనలతో రూపొందిన ‘గీత సాక్షిగా’ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు ఆంథోని మట్టిపల్లి.