Charmi Kaur: ‘లైగర్’ ఫ్లాప్.. చార్మీ షాకింగ్ నిర్ణయం

విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా లైగర్ నిలుస్తుందని అంతా భావించినా అందుకు భిన్నంగా డిజాస్టర్ టాక్‌ని మూటగట్టుకుంది. మైక్ టైసన్ వంటి ప్రపంచ చాంపియన్ ఉన్నా కంటెంట్ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్ మరోసారి నిరూపించింది. ఫలితంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చిందంటున్నారు సినీ విశ్లేషకులు.
చదవండి: నిర్మాతతో టీవీ నటి రెండో పెళ్లి, కొత్త జంటపై దారుణమైన ట్రోల్స్
ఇక లైగర్ ఫలితం అనంతరం చార్మీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఆమె ట్వీట్ చేస్తూ ట్రోలర్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. తాను సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘చిల్ గాయ్స్. కాస్తా బ్రేక్ తీసుకుంటున్నా(సోషల్ మీడియాకు). పూరీ కనెక్ట్స్ త్వరలోనే మరింత దృఢంగా, మునుపటికి కంటే ఉత్తమంగా తిరిగి వస్తుంది. అప్పటి వరకు కాస్తా శాంతించండి అబ్బాయిలు’ అంటూ చార్మీ రాసుకొచ్చింది. ఇక చార్మీపై కొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా లైగర్ ఫ్లాప్‌తో విజయ్‌తో పాటు పూరీ కనెక్ట్స్ నిర్మాతలైన చార్మీ, పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు!
ప్రమోషన్స్‌లో విజయ్ ఓవరాక్షన్, నోటి దురుసు వల్లే ఈసినిమా ఫ్లాప్ అయ్యిందని, అతడిని నమ్ముకున్నందుకు పూరీ కనెక్ట్స్ పని అయిపోయిందంటూ సోషల్ మీడియా విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు చార్మీ, పూరీ కనెక్ట్స్‌ను ట్యాగ్ చేస్తూ సినిమా అసలు బాగోలేదని, విడుదలకు ముందు క్రియేట్ చేసిన హైప్ కథలోనే లేదని.. కథ, కథనం చాలా బలహీనంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటి కారణంగానే ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Chill guys!
Just taking a break
( from social media )@PuriConnects will bounce back 😊
Bigger and Better...
until then,
Live and let Live ❤️— Charmme Kaur (@Charmmeofficial) September 4, 2022
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు