Bollywood Actor-Director Tariq Shah Passes Away In Mumbai Hospital - Sakshi
Sakshi News home page

ప్రముఖ టీవీ నటి భర్త, నటుడు మృతి

Apr 3 2021 5:50 PM | Updated on Apr 3 2021 8:29 PM

Bollywood Director And Actor Tariq Shah Died At 80 - Sakshi

బాలీవుడ్‌ నటుడు దర్శకుడు తారిఖ్‌ షా మృతి చెందారు. కొంతకాలంగా న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం ముంబై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు. తారిఖ్‌ ప్రముఖ టీవీ నటి షోమా అనంద్‌ భర్త. వీరిద్దరూ 1987లో వివాహం చేసుకున్నారు. కాగా తారిఖ్‌ ‘బాహర్‌ ఆనే తఖ్‌’, ‘గుమ్నామ్‌ హై కోయ్’‌, ‘ముంబై సెంట్రల్’ చిత్రాల్లో నటించాడు.

ఆ తర్వాత 1995లో వచ్చిన హిట్‌ చిత్రం ‘జనమ్‌ కుండ్లీ’ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో వినోద్‌ ఖన్నా, జితేంద్రా రినా రాయ్‌, అనుపమ్‌ ఖేర్‌తో పాటు తదితరులు నటించారు. దీనితోపాటు కడ్వా సచ్‌ మూవీకి ఆయన దర్శకుడిగా వ్యవహించారు. కాగా షోమా ఆనంద్‌, తారిఖ్‌ షాలు 1987లో వివాహం చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement