బిగ్‌బాస్‌ విన్నర్‌ ఓవరాక్షన్‌.. యూట్యూబర్‌ను దారుణంగా కొడుతూ.. | Bigg Boss Winner Elvish Yadav Assault YouTuber Sagar Thakur | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ విన్నర్‌ ఓవరాక్షన్‌.. యూట్యూబర్‌ను కాలితో తన్నుతూ, కొడుతూ..

Mar 9 2024 8:10 AM | Updated on Mar 9 2024 8:53 AM

Bigg Boss Winner Elvish Yadav Assault YouTuber Sagar Thakur - Sakshi

ఎల్విష్‌ యాదవ్‌ నన్ను కలవాలనుకుంటున్నాడని తెలిసినప్పుడు ఏదో మాట్లాడతాడనుకున్నాను. కానీ 10 మందిని వెంటేసుకుని వచ్చి నాపై దాడి చేశాడు.

హిందీ బిగ్‌బాస్‌ విన్నర్‌ ఎల్విష్‌ యాదవ్‌ ఓ యూట్యూబర్‌పై దాడి చేశాడు. తన మనుషులను వెంటేసుకుని షాపింగ్‌మాల్‌కు వెళ్లి సాగర్‌ ఠాకూర్‌ అలియాస్‌ మాక్స్‌టర్న్‌ను చితకబాదాడు. మొదటగా తనను కలిసేందుకు వచ్చాడేమోననుకుని పలకరించడానికి ముందుకు వెళ్లాడు సదరు యూట్యూబర్‌. కానీ అతడు దగ్గరకు వెళ్లగానే ఎల్విష్‌.. తన చెంప చెళ్లుమనిపించాడు. కాలితో తన్నాడు.

10 మందితో కలిసి దాడి
అతడు తిరిగి దాడి చేద్దామనుకునేలోపు ఎల్విష్‌ మనుషులు సాగర్‌ను చితకాబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు గురుగ్రామ్‌ పోలీసులు ఎల్విష్‌ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. 'ఎల్విష్‌ నన్ను కలవాలనుకుంటున్నాడని తెలిసినప్పుడు ఏదో మాట్లాడతాడనుకున్నాను. కానీ 10 మందిని వెంటేసుకుని వచ్చి నాపై దాడి చేశాడు.

బూతులు మాట్లాడుతూ..
వారు తాగి ఉన్నారు. బూతులు మాట్లాడుతూ కొట్టారు. ఎల్విష్‌ నా వెన్నెముక విరగ్గొట్టాలని చూశాడు. మార్చి 8న ఈ ఘటన జరిగింది. అతడు వెళ్లిపోతూ నన్ను చంపేస్తానని బెదిరించాడు' అంటూ మరో వీడియో రిలీజ్‌ చేశాడు యూట్యూబర్‌. కాగా సాగర్‌ ఠాకూర్‌.. గతంలో ఎల్విష్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని, ఆ కోపంతోనే ఇలా దాడి చేశాడని తెలుస్తోంది. అటు ఎల్విష్‌.. పామువిషంతో రేవ్‌ పార్టీ చేసుకున్నాడంటూ గతేడాది చివర్లో అతడిపై కేసు కూడా నమోదైంది. ఇంతలోనే మరోసారి చీప్‌గా ప్రవర్తిస్తూ కేసులో ఇరుక్కున్నాడు.

చదవండి: చెఫ్‌ అవతారంలో మన గ్లోబల్ స్టార్.. ఉపాసన వీడియో వైరల్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement