Bigg Boss Telugu 6: Singer Revanth Slip Of the Tongue - Sakshi
Sakshi News home page

Singer Revanth: ఏంది రేవంత్‌? మొదటి రోజే బూతులా? ఇలాగైతే కష్టమే!

Sep 6 2022 6:49 PM | Updated on Sep 7 2022 6:13 PM

Bigg Boss Telugu 6: Singer Revanth Slip Of the Tongue - Sakshi

ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకానొక సమయంలో కొంత బూతు మాట్లాడి ఆ వెంటనే నాలుక్కరుచుకుని సారీ చెప్పాడు. తాను వండింది నచ్చితే తినండి లేదంటే లేదంటూ చిరాకు ప్రదర్శిస్తున్నాడు.

బిగ్‌బాస్‌ షో అంటేనే ఓ మాయాలోకం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు. అంతేకాదు, కంటెస్టెంట్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారనేది కూడా ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. సాధారణంగా బిగ్‌బాస్‌ షోలో ఎంటరైన కంటెస్టెంట్లకు ఆ హౌస్‌ అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది. కానీ కొందరు మాత్రం అబ్బే, ఇది మన ఇల్లే అనేట్లుగా సౌకర్యంగా ఫీలవుతున్నారు. అప్పుడే చికాకులు పడుతూ, పెడుతూ చిటపటలాడుతున్నారు.

మరీ ముఖ్యంగా బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో మొదటి రోజు ఆర్జీవీ హీరోయిన్‌ ఇనయ సుల్తాన, గలాటా గీతూ, సింగర్‌ రేవంత్‌ హైలైట్‌ అయ్యారు. కారణం గీతూ, ఇనయ గొడవపడ్డారు. అటు రేవంత్‌ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకానొక సమయంలో కొంత బూతు మాట్లాడి ఆ వెంటనే నాలుక్కరుచుకుని సారీ చెప్పాడు. తాను వండింది నచ్చితే తినండి లేదంటే లేదంటూ చిరాకు ప్రదర్శిస్తున్నాడు.

తనకసలు బిగ్‌బాస్‌ షో గురించి అవగాహన లేదంటూ, తోటి కంటెస్టెంట్లు ఎవరూ తెలీదంటూ ఏవేవో మాట్లాడేస్తున్నాడు. దీంతో రేవంత్‌ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడేంటని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే అతడు కొంత కన్‌ఫ్యూజ్‌ అవుతున్నాడని, బిగ్‌బాస్‌ ఇంట్లో సర్దుకోవడానికి కొంత టైం పడుతుందంటూ సింగర్‌ను వెనకేసుకొస్తున్నారు అతడి ఫ్యాన్స్‌.

చదవండి: బిగ్‌బాస్‌ చెప్పినా ఆ పని మాత్రం చేయను: గీతూ
అమీర్‌పేట హాస్టల్‌లా బిగ్‌బాస్‌ హౌస్‌, పాపం కంటెస్టెంట్లు

Advertisement
 
Advertisement
Advertisement