Bigg Boss Telugu OTT Non Stop: Shree Rapaka Revealed About Her Love Break Up - Sakshi
Sakshi News home page

Shree Rapaka : 'కమాండ్‌ చేసే అబ్బాయే భర్తగా కావాలి.. అప్పుడే లైఫ్‌ బోర్‌ కొట్టదు'

Mar 19 2022 11:14 AM | Updated on Mar 19 2022 2:59 PM

Bigg Boss Non Stop: Shree Rapaka Revealed About Her Break Up - Sakshi

Shree Rapaka Revealed About Her Break Up: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. 24గంటల ఎంటర్‌టైన్‌మెంట్‌తో కంటెస్టెంట్లు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్నారు. ఇటీవలె బిగ్‌బాస్‌ ఓటీటీలో  రెండోవారం ఎలిమినేట్‌ అయి బయటికొచ్చిన శ్రీ రాపాక తాజాగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె గతంలో ఓ మ్యూజిక్‌ డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

'బిగ్‌బాస్‌లో నా లవ్‌స్టోరీ గురించి చెప్పాను. దాన్ని లవ్‌ ఫెయిల్యూర్‌ అని అనను. ఎందుకంటే, ఇద్దరం ఒకే ఫీల్డ్‌లో ఉండే సెట్‌ అవుతుందనుకున్నా కానీ అదే దెబ్బ కొట్టింది. మేం పెద్దగా గొడవ పడింది లేదు. విడిపోవాలని అనుకోలేదు. కానీ తెలియకుండానే మా మధ్య గ్యాప్‌ వచ్చింది. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. దాదాపు రెండేళ్లు అవుతుంది. తను కాల్‌ చేయడు, నేనూ చేయను. అతను ఇంకా పెళ్లి చేసుకోలేదు.

ఇప్పటికీ 4 సినిమాలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతని తర్వాత నేను కూడా ఎవరిని లవ్‌ చేయలేదు. ఇక పెళ్లి విషయానికి వస్తే.. నన్ను కమాండ్‌ చేసే అబ్బాయే నాకు భర్తగా కావాలి. అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా. కమాండ్ చేసే మగాడు ఉంటేనే లైఫ్ కొత్తగా అనిపిస్తుంది.. ఆ కొత్తలో లైఫ్ బోర్ కొట్టదు. నేను ప్రేమను ఇస్తా.. ఆ ప్రేమను తిరిగి ఇస్తే చాలు' అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement