Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ షోలో ట్విస్టులు, ఆ ఐటం గర్ల్, ఆర్జీవీ హీరోయిన్.. ఇంకా!

బుల్లితెర ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకున్న బిగ్‌బాస్ షో ఆరో సీజన్ కోసం భారీగా కసరత్తులు జరుగుతున్నాయి. బిగ్‌బాస్ హౌస్ గేట్ దగ్గర నుంచి లోపల బెడ్‌రూమ్ వరకు అన్నీ అందంగా అమర్చారట. అలాగే కంటెస్టెంట్ల ఎంపిక దగ్గర నుంచి ఎలిమినేషన్స్ వరకు అన్నీ పకడ్బందీగా ఉండాలని చూస్తున్నారట. ఇక ఇప్పటికే కంటెస్టెంట్లు ఎవరనేది నెట్టింట ఓ లిస్టు వైరల్‌గా మారింది.
దీని ప్రకారం అ అంటే అమలాపురం అంటూ ఐటం సాంగ్‌తో షేక్ చేసిన అభినయ శ్రీ ఈసారి హౌస్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఆర్జీవీ మెచ్చిన బ్యూటీ ఇనయ సుల్తానా కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. అలాగే నటుడు బాలాదిత్య, యూట్యూబర్, ఆదిరెడ్డి, గలాటా గీతూ, నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ- సుదీప, జబర్దస్త్ కమెడియన్లు ఫైమా, చలాకీ చంటి, నటుడు శ్రీహాన్, సింగర్ రేవంత్, వాసంతి కృష్ణన్, యాంకర్ ఆరోహి రావు, తన్మయ్, శ్రీసత్య, బుల్లితెర దంపతులు రోహిత్-మెరీనా అబ్రహం, కామన్ మ్యాన్ రాజశేఖర్, అర్జున్ కల్యాణ్, దీపిక పిల్లి కంటెస్టెంట్లుగా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిద్దరు హ్యాండిచ్చే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారట మేకర్స్. సాధారణంగా నామినేషన్స్ సోమవారం జరుగుతాయి. కానీ ఈసారి మాత్రం టాస్కును బుధవారం ప్రసారం చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. వీక్ డేస్‌లో పెద్దగా జనాలు షోని చూడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లో భోగట్టా! ఇకపోతే బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్.. సెప్టెంబర్ 4న సాయంత్రం ఆరు గంటలకు గ్రాండ్‌గా మొదలు కానుంది.
Wishing you a very Happy Birthday @iamnagarjuna
Many More Happy Return of the day 🥳🥳 #HappyBirthdayNagarjuna
Entertainment ki Adda Fix with King 👑 Nagarjuna and #BiggBossTelugu6
Starting This Sunday 6 pm onwards pic.twitter.com/rGC7E5vFYV— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 29, 2022
చదవండి: క్రికెట్ చూడనన్నావ్, నచ్చదన్నావ్? మరి ఇదేంటి?
ఒకే భవనంలో అపార్ట్‌మెంట్స్ కొన్న ఇద్దరు స్టార్ హీరోలు!
మరిన్ని వార్తలు