బిగ్‌బాస్‌ : చివరి క్షణంలో ట్విస్ట్‌.. తెరపైకి కొత్త పేరు | Bigg Boss 5 Telugu: Unexpected Name In Contestants List | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 telugu: చివరి క్షణంలో ట్విస్ట్‌.. తెరపైకి కొత్త పేరు

Sep 5 2021 4:43 PM | Updated on Sep 5 2021 6:53 PM

Bigg Boss 5 Telugu: Unexpected Name In Contestants List - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద రియాలిటీ షో సందడి మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 5 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. నయా సీజన్ , నయా కంటెస్టెంట్స్, నయా టాస్క్స్ తో, బిగ్ బాస్  హోస్ట్ కింగ్ నాగార్జున వచ్చేస్తున్నారు.

100 రోజులు,15 వారాలు, నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతోంది బిగ్ బాస్ సీజన్ 5. గత నాలుగు సీజన్స్ తో పోలిస్తే,ఈసారి కాస్త జోష్ తక్కువగా ఉన్నా, షో ప్రారంభమైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు షో నిర్వాహకులు. నవరస ట్రెండ్ ను ఫాలో అవుతూ, ఈసారి టాస్క్ లు కొత్తగా ఉండనున్నాయని సమాచారం.

తెరపైకి కొత్త పేరు
ఇక సీజన్ 5లో కనిపించబోతున్న కంటెస్టెంట్స్ ఎవరూ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. షో నిర్వాహకులు ఎక్కడా చిన్న లీక్ లేకూండా జాగ్రత్త పడుతున్నారు.సోషల్ మీడియాలో మాత్రం యాంకర్ రవి, సోషల్ మీడియా స్టార్ షన్ముఖ్, నటి ప్రియ, ట్రాన్స్ జెండర్ ప్రియాంక, సీరియల్ ఆర్టిస్ట్ మానస్, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య, లహరి, నవ్యసామి, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో, శ్వేత వర్మ, ఆట సందీప్, జ్యోతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు హౌజ్ లోకి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. బిగ్‌బాస్‌ 5లో సింగర్‌ ఫరిదా కూడా పాల్గొనబోతున్నట్లు సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. మరి వీరిలో ఎవరు బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగు పెడతారో మరి కొద్ది గంటల్లో తెలిసిపోతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement