Bigg Boss 5 Telugu: తొలి కంటెస్టెంట్‌గా సిరి హన్మంత్

Siri Hanmanth In Bigg Boss 5 Telugu: విశాఖపట్నంలో ప్రాంతీయ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పని చేసిన సిరి హన్మంత్ ఆ తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. ఇక్కడ కూడా న్యూస్ రీడర్‌గా వర్క్ చేసిన సిరికి బుల్లితెర సీరియల్‌లో నటించే ఆఫర్ రావడంతో ఆమె నటన వైపు అడుగులు వేసింది. అదే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ‘ఉయ్యాలా జంపాల', ‘అగ్నిసాక్షి' సహా పలు ధారావాహికల్లో నటించిన ఆమె ‘సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్లు' అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ నటించింది.
వీటితో పాటు ‘రామ్ లీలా', ‘మేడం సార్ మేడం అంతే' వంటి వెబ్ సిరీస్‌లు చేసింది. ఇవి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలవడంతో ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువైంది. టీవీలో ప్రసారమయ్యే స్పెషల్ ఈవెంట్లకు కూడా ఈమెకు ప్రత్యేక ఆహ్వానాలు అందుకుంటోంది. బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో తొలి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది సిరి. మరి యూట్యూబ్ ద్వారా జనాలను అలరించిన ఈ భామ బిగ్‌బాస్ షోలో ఎంత సందడి చేస్తుందో చూడాలి!