
కొత్త బంగారులోకం సినిమాతో వెండితెరపై నటుడిగా సయ్యద్ సోహైల్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ తర్వాత తనకు మంచి బ్రేక్ అనేదే రాలేదు. సయ్యద్ అటు సినిమాలతోపాటు పలు సీరియల్స్‌లోనూ నటిస్తున్నాడు. అయితే గతేడాదిగా బిగ్‌బాస్ కోసం ఏ ప్రాజెక్టును ఒప్పుకోలేదని స్టేజ్‌పై వెల్లడించాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలంటే అది బిగ్‌బాస్ మాత్రమేనని బలంగా నమ్మానని చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు బిగ్‌బాస్‌కు రావాలన్న కల నెరవేరిందని సంతోషించాడు. అతడిని అందరూ ఇస్మార్ట్ సోహైల్ అని పిలుస్తారని చెప్పాడు అయితే అతను రాగానే నేరుగా ఇంట్లోకి కాకుండా సీక్రెట్ రూమ్‌లోకి పంపడం విశేషం. ఆ తర్వాత అదే రూమ్‌లోకి అరియానా గ్లోరీని కూడా పంపారు. వీళ్లిద్దరూ ఈ సీక్రెట్ రూమ్‌లో ఎన్ని రోజులు ఉంటారో చూడాలి.