Allari Naresh Ugram Movie Twitter Review In Telugu | 'ఉగ్రం' ట్విటర్ రివ్యూ - Sakshi
Sakshi News home page

Ugram Movie Twitter Review: 'ఉగ్రం' ట్విటర్ రివ్యూ

May 5 2023 7:24 AM | Updated on May 5 2023 1:32 PM

Allari Naresh Ugram Movie Twitter Review - Sakshi

నాంది వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, డైరెక్టర్‌ విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన మరో చిత్రం 'ఉగ్రం'. మీర్నా మీనన్‌ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అసలు ఉగ్రం కథేంటి? ఎలా ఉంది? అల్లరి నరేశ్ యాక్షన్‌పై తమ అభిప్రాయాలను ట్విటర్‌లో పంచుకుంటున్నారు. నాంది తర్వాత యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఉగ్రం. 

(ఇది చదవండి: సినిమాల్లోకి రావాలన్న ఇంట్రస్టే లేదు: త్రిష)

ఉగ్రం సినిమాలో అల్లరి నరేశ్ యాక్షన్‌ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. సెకండాఫ్‌లో క్లైమాక్స్, ఫైట్ సీన్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ విశ్వరూపం చూపించాడని ట్విటర్ వేదికగా స్పందిస్తున్నారు. మరికొందరు అల్లరి నరేష్ ముఖ్యంగా క్లైమాక్స్ ఫర్ఫార్మెన్స్ అదిరిపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల అతని డైలాగ్ డెలివరీ కొన్ని మాస్ సీన్స్‌లో సింక్ కాలేదని అంటున్నారు. బీజీఎం కొన్ని సీన్స్‌లో డీసెంట్‌గా ఉందని చెబుతున్నారు. కొందరు ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందనగా.. సెకండాఫ్‌లో గూస్‌బంప్స్‌ ఖాయమంటున్నారు. ఉగ్రం అల్లరి నరేశ్ యాక్షన్ వేరే లెవెల్‌లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement