18 పేజెస్’ డబ్బింగ్‌ ప్రారంభం..ఫోటో షేర్‌ చేసిన నిఖిల్‌

Actor Nikhil Siddhartha Begins Dubbing For 18 Pages - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా నటిస్తోన్న చిత్రం 18 పేజెస్. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్‌ సూర్యప్రతాప్‌ తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఓ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు హీరో నిఖిల్‌ డబ్బింగ్‌ మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top