Naresh - Pavitra Lokesh: నరేశ్- పవిత్రల మళ్లీ పెళ్లి.. ఇదీ అసలు సంగతి!

నటుడు నరేశ్, పవిత్రలు పెళ్లి చేసుకున్నారంటూ ఓ వీడియో తెగ వైరలయిన సంగతి తెలిసిందే! ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చుకున్న ఫోటో కూడా తెగ చక్కర్లు కొట్టింది. వీళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని గతంలోనే ప్రకటించడంతో నిజంగానే వీరి పెళ్లి అయిపోయిందనుకున్నారంతా! కానీ కొందరు మాత్రం ఇది రియల్ పెళ్లిలా లేదే? రీల్ పెళ్లిలా ఉందే! అని అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా వారి అనుమానమే నిజమైంది. నరేశ్- పవిత్రల పెళ్లి సినిమా ప్రమోషన్స్‌లో భాగమేనని రుజువైంది.
పవిత్రతో కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేసినట్లు వెల్లడించాడు నరేశ్. ఈ చిత్రం వేసవి కానుకగా థియేటర్లలో విడుదల కానున్నట్లు పోస్టర్, వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశాడు. తెలుగులోనే కాకుండా కన్నడలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు చావు దెబ్బ కొట్టావ్.. నీ పని బాగుంది అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
A beautiful project to celebrate the glorious 50th anniversary of #VijayakrishnaMovies🤩
Here’s the 1st Look of my next #MattheMaduve ❤️
Kannada - https://t.co/6jOBbGUKSPDirected by @MSRajuOfficial
Co-starring #PavitraLokesh😍
Summer 2023 Release!@VKMovies_ pic.twitter.com/pbxIgzQQZc
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 24, 2023
#MalliPelli #MattheMaduve ❤️ pic.twitter.com/eqxa2TVELb
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 24, 2023
మరిన్ని వార్తలు :