Tamil Actor Harish Kalyan Announces Wedding Introduces His Wife-To-Be Narmada Udaykumar - Sakshi
Sakshi News home page

Harish Kalyan: కాబోయే భార్యను పరిచయం చేసిన కోలీవుడ్‌ హీరో

Oct 6 2022 10:18 AM | Updated on Oct 6 2022 10:46 AM

Actor Harish Kalyan To Tie Knot With Narmada Udhaykumar See Pics - Sakshi

కోలీవుడ్‌ నటుడు హరీశ్‌ కల్యాణ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు. త్వరలోనే తాను పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు పేర్కొన్నాడు. దసరా పండుగ సందర్భంగా కాబోయే భార్యను అభిమానులకు పరిచయం చేశాడు. 'నటుడిగా నా కెరీర్‌ మొదలైనప్పటి నుంచి ఎంతో సపోర్ట్‌ చేశారు. మీ ప్రేమాభిమానాలతో నన్ను ఈ స్థాయికి చేర్చారు. ఇప్పుడు నా జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా. ఈ విషయం మీకు తెలియజేయడం ఆనందంగా ఉంది.

నర్మదా ఉదయ్‌కుమార్‌తో త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెడుతున్నాను. మాకు మీ ఆశీస్సులు కావాలి' అంటూ కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశాడు. ఈ ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా 2010లో ‘సింధు సమవ్లీ’ సినిమాతో అరంగేట్రం చేసిన హరీశ్‌ కల్యాణ్‌ తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌-1లో 4వ రన్నరప్‌గా నిలిచాడు. ప్యార్ ప్రేమ కాదల్, ఇస్పడే రాజుం ఇదయ రాణియుం వంటి పలు సినిమాల్లో నటించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement