‘చరణ్‌ సర్‌ మాటలు విని గూస్‌బమ్స్ వచ్చాయి’ | Acharya Movie: Art Director Suresh Selvarajan Praises Ramcharan | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌పై సెల్వరాజన్ ప్రశంసలు

Dec 27 2020 12:00 PM | Updated on Dec 27 2020 1:50 PM

Acharya Movie: Art Director Suresh Selvarajan Praises Ramcharan - Sakshi

న‌క్స‌లైట్ పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ఇక ఈ మూవీలోరామ్ చరణ్ కూడా ఓ ఫుల్ లెంత్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే.

న‌క్స‌లైట్ పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ రోజు చెర్రీ  ఆచార్య సెట్‌లో అడుగుపెట్టాడు. దర్శకుడు కొరటాలతో కలిసి టీ తాగుతూ అందరికి పలకరించాడు. ఈ సందర్భంగా ఆర్ట్‌ డైరెక్టర్‌ సెల్వరాజన్ వేసిన సెట్‌పై రామ్‌ చరణ్‌ ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని  స్వయంగా తెలిపిన సెల్వరాజన్‌.. చరణ్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ 'సెట్‌లో మీరు చెప్పిన మాటలకు గూస్‌బమ్స్ వచ్చాయి సర్. మీ ప్రశంసలను ఎప్పటికీ మర్చిపోలేను. అవి నా పనిలో శ్రద్ధను మరింతగా పెంచాయి. మీ విలువైన మాటలకు ధన్యవాదాలు సార్' అంటూ రాసుకొచ్చాడు. వచ్చే ఏడాది వేసవిలో ‘ఆచార్య’ను థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement