‘తాము జిల్లా సరిహద్దులో ఉన్న భూములు సాగు చేసుకోవడం తప్పా..? ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఏటా నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఏ అధికారి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు’ అని మండలపరిధిలోని కొత్తపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండల పరిధిలో కొత్తపల్లికి చెందిన దాదాపు 400 ఎకరాల భూమి కామారెడ్డి పొల్కంపేట రెవెన్యూ పరిధిలో ఉంది. గతంలో ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో రైతులు ఏదో చోట అమ్ముకునేవారు. జిల్లా సరిహద్దులో ఉన్న వడ్లు తూకం వేస్తే 30 లారీల వరకు ధాన్యం తరలించాల్సి ఉంటుంది. దీంతో ఈ ధాన్యాన్ని తూకం చేయమని కామారెడ్డి అధికారులు చెబుతున్నారు. ఎక్కడ పండించారో అక్కడే తూకం వేసుకోవాలని సూచిస్తున్నారు. మెదక్‌లో అమ్ముకుందామంటే మీ స్వగ్రామం ఎక్కడో అక్కడే తూకం వేసుకోవాలని చెబుతున్నారు. దీంతో రైతులు ఏమీ తోచక ఆందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా జిల్లాలు ఏర్పడి ఆన్‌లైన్ కావడంతో ఏటా ధాన్యం అమ్ముకునే సమయానికి అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పోల్కంపేట, లింగంపేట కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను బతిమిలాడితే ప్రస్తుతం అరకొరగా ధాన్యం తూకం వేస్తున్నారని చెబుతున్నారు.
సరిహద్దు సంకటం
కామారెడ్డి జిల్లా
పొల్కంపేట శివారు రైతుల ఆవేదన
పంటను అమ్ముకునేందుకు
నానా అవస్థలు


