కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్‌జోన్ : జీరో యాక్సిడెంట్ జోన్‌గా జిల్లాను తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో అరైవ్–అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్, రవాణాశాఖ సమన్వయంతో నిర్వహించిన రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే ప్రాణనష్టాల గురించి వివరించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అతివేగం, అజాగ్రత్త వల్ల తరచు మరణాలు సంభవిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడమే పోలీస్ శాఖ ప్రధాన కర్తవ్యంగా ముందుకెళ్తున్నట్లు వివరించారు. ఈసందర్భంగా వాహన డ్రైవర్ల వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఎంహెచ్‌ఓ శ్రీరామ్, జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి, డీఎస్పీ ప్రసన్న కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్‌గౌడ్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


