నో హెల్మెట్‌.. నో ఎంట్రీ | - | Sakshi
Sakshi News home page

నో హెల్మెట్‌.. నో ఎంట్రీ

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

శివాయపల్లిలో వినూత్న కార్యక్రమం

శివాయపల్లిలో వినూత్న కార్యక్రమం

రామాయంపేట(మెదక్‌): హెల్మెట్‌ పెట్టుకోనిదే గ్రామంలోకి రావొద్దని మండలంలోని శివాయపల్లి గ్రామస్తులు నినదించారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో జరిగిన అలైవ్‌– అరైవ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్‌ లేనిదే ఎవరూ ద్వి చక్రవాహనాలు నడపొద్దని సూచించారు. తాము గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. సీఐ వెంకట్‌రాజాగౌడ్‌ మాట్లాడుతూ గ్రామంలో వందశాతం హెల్మెట్లు ధరించడంతో పాటు వంద శాతం డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఇన్సూరెన్స్‌ కలిగి ఉండాలని సూచించారు. గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించామని, బెల్ట్‌షాపులు మూసి వేయిస్తామని గ్రామస్తులు తెలిపారు. అంతకుముందు పోలీస్‌ అధికారులతో కలిసి ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంవీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ రజని, ఎస్‌ఐ బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement