సమస్యల పరిష్కారానికే ‘ప్రజాపాలన’ | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికే ‘ప్రజాపాలన’

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని డీఎల్‌పీఓ సాయిబాబ అన్నారు. గురువారం కౌడిపల్లి రైతువేదికలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా అధికారులు, సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు సమస్యలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని, వాటిని మినిట్స్‌బుక్‌లో నమోదు చేసి కలెక్టర్‌కు తెలియజేస్తామన్నారు. ఈసందర్భంగా పలు గ్రామాల సర్పంచ్‌లు సమస్యలను ప్రస్తావించారు. ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి భద్రతపై వివరించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ కృష్ణ, ఏఓ స్వప్న, పీఆర్‌ డిప్యూటీ ఈఈ అమరేశ్వర్‌, ఎంఈఓ బాలరాజు, విద్యుత్‌శాఖ ఏఈ సాయికుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement