మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

నర్సాపూర్‌: మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు త్వరలోనే ఆమోదం పొందుతుందని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ విద్యార్థుల గ్యాడ్యుయేషన్‌ డే కార్యక్రమానికి ఆయ న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుకురావాలని పిలుపునిచ్చా రు. మూడు అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ఎంపీ లాడ్స్‌ నుంచి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. తాను సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, పిల్లలకు కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించామన్నారు. కార్య క్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, వైస్‌ చైర్మన్‌ బుచ్చెష్‌, సీడీపీఓ హేమభార్గవి, కౌన్సిలర్లు నర్సమ్మ, రాజు, సరళ, ప్రాజెక్టు సూపర్‌వైజర్లు శివకుమారి, సంతోషిమాత, మెహతాబేగం, సరళకుమారి, కవిత, వసుమతి, లక్ష్మి, నర్సమ్మ, సంతోష, కుమర్‌సుల్తానా, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ రఘునందన్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement