రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

తూప్రాన్‌: ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్‌శాఖ పనిచేస్తుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ఎస్పీ శ్రీనివాస్‌రావు పిలుపునిచ్చారు. ‘అరైవ్‌–అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా బుధవారం తూప్రాన్‌, నర్సాపూర్‌ చౌరస్తాతో పాటు మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని పలు సలహాలు సూచనలు అందజేశారు. వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి రోడ్డు నిబంధనల గురించి వివరించారు. ఈసందర్భంగా మానవహారం చేపట్టి రోడ్డు నియమాలు పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్‌ రూల్స్‌ తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 7000 ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్‌గౌడ్‌, సీఐలు రంగాకృష్ణ, జాన్‌రెడ్డి, వెంకటరాజుగౌడ్‌తో పాటు ఎస్‌ఐలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్‌ తూప్రాన్‌ ఆర్డీఓ కార్యాలయంలో పదో తరగతి విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement