అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

Apr 15 2026 8:44 AM | Updated on Apr 15 2026 8:44 AM

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

వెల్దుర్తి(తూప్రాన్‌): రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం మండల పరిధి శేరీల గ్రామంలో పర్యటించిన శ్రీఅలైవ్‌..అరైవ్‌శ్రీ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత నియమాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటిస్తామంటూ గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ పెట్టుకోవాలని, కార్లలో తప్పనిసరిగా సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలన్నారు. మైనర్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వొద్దని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లావణ్య, తూప్రాన్‌ సీఐ రంగా కృష్ణ, ఎస్‌ఐ రాజు, పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి

కౌడిపల్లి(నర్సాపూర్‌): వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని సలాబత్‌పూర్‌లో గ్రామస్తులకు అరైవ్‌, అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని.. మైనర్లు డ్రైవింగ్‌ చేయొద్దని సూచించారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.

బ్లాక్‌ స్పాట్లను గుర్తించి చర్యలు

చిన్నశంకరంపేట(మెదక్‌): నార్సింగి జాతీయ రహదారిపై ప్రమాద బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. మంగళవారం నార్సింగి ఎస్‌ఐ సృజన, జీఎంఆర్‌, ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ ప్రతినిధులతో కలిసి జాతీయ రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నార్సింగి 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ప్రధానంగా వల్లూర్‌ యూటర్న్‌, కామారం యూటర్న్‌, వల్లాభాపూర్‌ యూటర్న్‌, ఖాస్లాపూర్‌ యూటర్న్‌లను గుర్తించారు. ఈ ప్రదేశంలో జీబ్రాక్రాసింగ్‌లు, సోలార్‌ బ్లింకర్లు, రంబుల్‌ స్ట్రిప్‌లు, సూచిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రదేశాల్లో సర్వీస్‌ రోడ్డు నిర్మాణం గురించి ఎన్‌హెచ్‌ఏఐ, జీఎంఆర్‌ సంస్థ అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

డీఎస్పీ నరేందర్‌గౌడ్‌

Advertisement
 
Advertisement
Advertisement