మలుపుల వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

మలుపుల వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

Apr 15 2026 8:44 AM | Updated on Apr 15 2026 8:44 AM

అక్కన్నపేట(హుస్నాబాద్‌): అక్కన్నపేట మండలం కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలోని మూలమలుపుల వద్ద మంగళవారం ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్‌ ఆధ్వర్యంలో ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వాహనదారుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఈ మూలమలుపు వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరిగేవని, వాహనదారులకు కనిపించేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేశామని చెప్పారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement