● పగిలిన మద్యం బాటిళ్లు
● గాజు పెంకులు గుచ్చుకుని గాయపడిన చిన్నారి
చేర్యాల(సిద్దిపేట): పట్టణ పరిధిలోని పెద్దచెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ మందుబాబులకు అడ్డా మారింది. స్థానికులు ప్రతిరోజు వాకింగ్ అనంతరం జిమ్ చేసేందుకు వీలుగా అధికారులు కట్టపై ఈ జిమ్ ఏర్పాటు చేశారు. కానీ అది కాస్తా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. జిమ్ ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మద్యం తాగి ఆ బాటిళ్లను పగులగొట్టి పోయారు. ఇది గమనించని ఓ చిన్నారికి గుచ్చుకోవడంతో కాలికి గాయమైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఇప్పటికై నా దీనిపై మున్సిపల్ అధికారులు, పోలీసులు స్పందించి మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వాకర్స్ కోరుతున్నారు..


