18న జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

18న జాబ్‌మేళా

Apr 15 2026 8:44 AM | Updated on Apr 15 2026 8:44 AM

18న జాబ్‌మేళా వేడుకగా వేంకటేశ్వరుని కల్యాణం

రామాయంపేట(మెదక్‌): స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 18న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ హిమజ్యోతి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎన్‌ కెమికల్‌ పరిశ్రమలో ఉద్యోగాల కోసం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్‌లో బైపీసీ, ఎంపీసీ, ఒకేషనల్‌ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలలో ఉదయం పది నుంచి మధ్నాహం మూడు వరకు ఇంటర్వ్యూలు కొనసాగుతాయని, హాజరమ్యే విద్యార్థులు తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో రావాలని ప్రిన్సిపాల్‌ తెలిపారు. 17 నుంచి 21 ఏళ్ల లోపు వయస్సు గల విద్యార్థులు ఇందుకు అర్హులని స్పష్టం చేశారు.

నంగునూరు(సిద్దిపేట): పాలమాకుల వేంకటేశ్వరాలయం 14వ వార్షికోత్సం మంగళవారం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం విశ్వక్సేనారాధన, అభిషేకం, గరుడపూజ, ప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం పద్మావతీ సమేత వేంకటేశ్వర కల్యాణం కనులపండువగా నిర్వహించారు. గరుడపూజ నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి అన్న సంతర్పణ నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement