నిర్లక్ష్యం వీడితే.. ప్రాణాలు పదిలం | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం వీడితే.. ప్రాణాలు పదిలం

Apr 14 2026 8:28 AM | Updated on Apr 14 2026 8:28 AM

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

టేక్మాల్‌(మెదక్‌): వాహనదారులు నిర్లక్ష్యం వీడితే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తెలిపారు. సోమవారం మండలంలోని బొడ్మట్‌పల్లిలో ‘అలైవ్‌– అరైవ్‌’ కార్యక్రమం నిర్వ హించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కారు నడిపే వారు సీటుబెల్టు పెట్టుకోవాలని పలు ఉదాహరణలతో వివరించారు. అతివేగం ప్రమాదకరమని, మద్యం సేవించే ఏ వాహనాన్ని నడపరాదన్నారు. వాహనదారులు చేసే అశ్రద్ధతో ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి తెచ్చుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. సమావేశం అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ తులసీరాం, సర్పంచ్‌ అవినాశ్‌కుమార్‌, ఉపసర్పంచ్‌ మాధవి, ఆర్‌ఐ సాయిశ్రీకాంత్‌, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement