19న ‘మోడల్‌’ ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

19న ‘మోడల్‌’ ప్రవేశ పరీక్ష

Apr 14 2026 8:28 AM | Updated on Apr 14 2026 8:28 AM

నర్సాపూర్‌ రూరల్‌: ఈనెల 19వ తేదీన మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపాల్‌ ఫర్హాన సోమవారం తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో చేరే విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7, 8, 9, 10వ తరగతిలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. హాల్‌టికెట్లతో పాటు బాల్‌పెన్‌, పరీక్ష ప్యాడ్లతో 30 నిమిషాల ముందు పరీక్షకు హాజరుకావాలని సూచించారు.

26 నుంచి జనగణన

మెదక్‌ కలెక్టరేట్‌: ఈనెల 26 నుంచి మే 10వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న జనగణన కోసం ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకం పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి కులగణన అధికారికి భారతి హోళికేరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి చేపట్టనున్న జన గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు. జనగణన కోసం 1,406 మంది ఎన్యుమరేటర్లు, 248 మంది సూపర్‌ వైజర్లను నియమించామన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

రామాయంపేట(మెదక్‌): విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్‌ హెచ్చరించారు. సోమ వారం మండలంలోని ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. ఈసందర్భంగా రికార్డులు పరిశీలించారు. వైద్య సిబ్బంది రోగుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ఆస్పత్రి వైద్యురాలు వైష్ణవి, ఇతర సిబ్బంది వెంట ఉన్నారు.

ముగిసిన ‘పది’ పరీక్షలు

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారంతో ముగిశాయి. జిల్లాలో మొత్తం 11,247 మంది విద్యార్థులకు గానూ 11,227 మంది హాజరు కాగా, మరో 20 మంది గైర్హాజరయ్యారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం 99.82 శాతం నమోదైంది. జిల్లాలోని నర్సాపూ ర్‌, శివ్వంపేట మండలాల్లోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ విజయ సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించినట్లు చెప్పారు. ఈనెల 15వ ఒకేషనల్‌కు సంబంధించి పరీక్ష ఉంటుందని తెలిపారు.

సింగూరు నీటితో

రైతులకు ఊరట

నర్సాపూర్‌: సింగూరు నుంచి నీరు విడుదల చేయడంతో నియోజకవర్గంలోని రైతులకు ఎంతో ఊరట లభిస్తుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి సింగూరు నుంచి నీరు విడుదల చేసేందుకు సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఘనపూర్‌ ఆనకట్టకు నీరు విడుదల చేయడానికి సహకరించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా సింగూరు నుంచి నీటి విడుదల ప్రక్రియను రైతులు సాధించిన గొప్ప విజయంగా ఆమె అభివర్ణించారు. కాగా భవిష్యత్తులో రైతుల సంక్షేమం, వారి అవసరాలను తీర్చేందుకు తాను కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.

కొనసాగుతున్న ఆర్టిజన్ల సమ్మె

మెదక్‌ కలెక్టరేట్‌: సమస్యల పరిష్కారం కోసం జిల్లా విద్యుత్‌ కార్యాలయం ఎదుట ఆర్టిజన్లు చేపట్టిన సమ్మె సోమవారం 6వ రోజుకు చేరుకుంది. శిబిరాన్ని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి సందర్శించి కార్మికులకు సంఘీభా వం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఆర్టిజెన్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యాలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆరు రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం సరికాదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement