డీటీఓ వెంకటస్వామి
మెదక్ కలెక్టరేట్: ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించడంతోనే ప్రమాదాలను నివారించవచ్చునని డీటీఓ వెంకటస్వామి అన్నారు. శనివారం మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ ఆధ్వర్యంలో బస్సు డిపో నుంచి పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ వరకు రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా డీటీఓ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. బస్సు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం చేయకూడదని హెచ్చరించారు. అలాగే ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకొని సంస్థను ఆదరించా లని కోరారు. అనంతరం రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మెదక్ ఆర్టీసీ డీఎం సురేఖ, ఎంఆర్‌కేరావు, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ వీరబాబు, మెకానికల్ ఫోర్‌మెన్ సుగు ణాకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


