ప్రథమ ఇంటర్‌లో 28, ద్వితీయంలో 26వ స్థానం | - | Sakshi
Sakshi News home page

ప్రథమ ఇంటర్‌లో 28, ద్వితీయంలో 26వ స్థానం

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● ఒకేషనల్‌ ఫస్ట్‌ ఇయర్‌లో రాష్ట్రంలోనే టాప్‌

● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● ఒకేషనల్‌ ఫస్ట్‌ ఇయర్‌లో రాష్ట్రంలోనే టాప్‌

ఇంటర్‌ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే జిల్లా 26వ స్థానానికే పరిమితమైంది. ఈసారి సెకండ్‌ ఇయర్‌లో 68.59 శాతం ఫలితాలు సాధించింది. బాలికలు 75.34 శాతం ఉత్తీర్ణత సాధించి ముందుండగా, బాలురు 58.9 శాతంతో వెనుకబడ్డారు. అయితే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో మాత్రం 55.27 శాతంతో 28వ స్థానంలో నిలిచింది. కాగా ఒకేషనల్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 73.46 శాతంతో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. 70 శాతం సింగిల్‌ సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ కావడం గమనార్హం. కాగా మెదక్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన డి.శివసాయి 984 మార్కులు

సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు.

– మెదక్‌ అర్బన్‌

జిల్లావ్యాప్తంగా 58 ఇంటర్‌ కళాశాలలు ఉండగా, వాటిలో 16 ప్రభుత్వ, మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది సెకండ్‌ ఇయర్‌ జనరల్‌ విభాగంలో 4,826 మంది పరీక్షలు రాయగా, 3,310 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 1,983 మందికి గాను 1,168 మంది పాసయ్యారు. బాలికలు 2,843 మందికి 2,142 ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 539 గాను 460 మంది పాస్‌ అయ్యారు. ఇక ఫస్ట్‌ ఇయర్‌ రెగ్యులర్‌ విభాగంలో 2,460 బాలురకు 1,156 మంది, 3,250 మంది బాలికలకు 2 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఫస్ట్‌ ఇయర్‌ ఒకేషనల్‌లో 599 మందికి 440 మంది ఉత్తీర్ణులై 73.46 శాతం సాధించడంతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

70 శాతం సింగిల్‌ సబ్జెక్ట్‌ వారే..

70 శాతం మంది సింగిల్‌ సబ్జెక్ట్‌లోనే ఫెయిల్‌ అయ్యారు. మే 13 నుంచి జరుగబోయే అడాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రతి కాలేజీలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. రాలేని వారికి జూమ్‌ క్లాసులు కొనసాగిస్తాం. ఈ ఏడాది విద్యార్థుల అటెండెన్స్‌ పెంచడానికి ఇంటింటికీ తిరిగాం. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాం. తల్లిదండ్రులతో ఫోన్‌ మానిట రింగ్‌ చేశాం. ప్రత్యేక తరగతులు నిర్వహించాం. అందువల్ల కొంతమేర ఉత్తీర్ణతా శాతం పెరిగింది.

– మాధవి, డీఐఈఓ

Advertisement
 
Advertisement
Advertisement