మౌలిక వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతులు కల్పించాలి

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి

మెదక్‌ కలెక్టరేట్‌: విద్యార్థులకు తక్షణం మౌలిక వసతులు కల్పించాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం మెదక్‌ నర్సింగ్‌ కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి సంబంధించి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ)కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కళాశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశా రు. విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలో డ్రైనేజ్‌ వ్యవస్థ సరిగా లేదన్నారు. ఆమె వెంట మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, కృష్ణారెడ్డి, న్యాయవాది జీవన్‌రావు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement