ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
చిన్నశంకరంపేట(మెదక్): కేసీఆర్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గో దాంలు నిర్మిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క గోదాం కూడా నిర్మించలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై సవతి తల్లి ప్రేమ చూపుతుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల సుజాతగౌడ్, తహసీల్దార్ గ్రేసిబాయి, ఐకేపీ సీసీ సృజన్‌కుమార్‌రెడ్డి, సీసీలు శ్రీనివాస్‌గౌడ్, శోభ, పీఏసీఎస్ సీఈఓ నర్సింహులు, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాబు తదితరులు పాల్గొన్నారు.


