పోషకాహారంపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

పోషకాహారంపై అవగాహన అవసరం

Apr 11 2026 9:16 AM | Updated on Apr 11 2026 9:16 AM

ఎమ్మెల్యే సునీతారెడ్డి

నర్సాపూర్‌ రూరల్‌: పౌష్టికాహారంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలోని ఆవంచలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పోషణ్‌ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై సిబ్బంది వివరించాలని సూచించారు. ప్రతి మంగళవారం మహిళలు, పిల్లలలో పోషణపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్‌ సెంటర్లలో ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకునేలా చైతన్య పరచాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు చేపట్టారు. అలాగే అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ ఫోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి హేమాభార్గవి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌రావు, సర్పంచ్‌ స్రవంతి, కరుణాకర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ రఘువరన్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు సరళ కుమారి, కవిత, శివకుమారి, కార్యదర్శి మల్లేశ్‌, కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement