కౌడిపల్లి(నర్సాపూర్): రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్‌శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం నర్సాపూర్ ఏడీ రమణారెడ్డి, ఏఈ సాయికుమార్ మండలంలోని వెంకట్రావుపేట, రాజిపేట సబ్‌స్టేషన్లను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద లో ఓల్టేజీ కారణాలను పరిశీలించి ఎంఆర్‌టీంను పిలిపించి సరిచేశామన్నారు. రైతులు సమస్యలు ఏర్పడితే చెప్పాలన్నారు. కార్యక్రమంలో లైన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, లైన్‌మెన్లు మహేశ్, పోచయ్య, ఎంఆర్‌టీ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


