● తీవ్రంగా పరిగణించిన అధికారులు
● టీచర్ ప్రమేయం లేకపోయినా అన్యాయంగా దాడి చేసినట్లు నిర్ధారణ
కంగ్టి(నారాయణఖేడ్): ఖేడ్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కంగ్టి సెక్టార్ రాసోల్ గ్రామంలోని అంగన్‌వాడీ టీచర్ వసంతకుమారిపై గ్రామస్తుల దాడి ఘటనపై జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలితా కుమారి ఆదేశాల మేరకు గురువారం సీడీపీఓ సుజాత, సూపర్‌వైజర్ సుజాత ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనతో టీచర్‌కు ప్రత్యక్ష సంబంధంలేదని తేలింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు దాడికి పాల్పడిన వారిపై కంగ్టి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అన్యాయంగా టీచర్‌పై దాడి చేసినట్లు అధికారులు నిర్ధారించి ఉన్నతాధికారులకు విచారణ నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులపై, మహిళలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి మండలంలోని రాసోల్ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌పై దాడిచేసిన ఐదుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖేడ్ నియోజక వర్గం అధ్యక్షుడు బొజ్జి రమేశ్, కోశాధికారి చంద్రకాంత్, కంగ్టి అధ్యక్షులు వెంకట్‌రావు, పీఆర్‌ఓ సుదర్శన్‌రావు, సభ్యులు రాఘవేందర్‌రావు సీఐ వెంకట్‌రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు.


