మెదక్ కలెక్టరేట్: 13 నుంచి ‘అరైవ్– అలైవ్’ వీక్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అధికారులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణరావు, డీజీపీ శివధర్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ శ్రీనివాసరావు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 13న గ్రామ సభలు నిర్వహించి, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులు విభిన్న పంటలను సాగుచేసి ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. రైతులను పామాయిల్ పంటల వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ
అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ సాధ్యమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం మెదక్ పట్టణంలో రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరం అన్నా రు. ఎయిడ్స్ ఒక నివారించలేని వ్యాధి అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే అరికట్టవచ్చని తెలిపారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


