చేగుంట(తూప్రాన్): ప్రభుత్వ వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం పేర్కొన్నారు. మంగళవారం చేగుంట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. బీపీ, షుగర్‌తో పాటు రక్త పరీక్షలు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. టీబీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా మందులను అందజేస్తున్నట్లు డాక్టర్ శ్రీరాం తెలిపారు. వైద్య శిబిరంలో 90 మందికి వైద్య పరీక్షలు, 40 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఆయన వెంట ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ అనీల్‌కుమార్, డాక్టర్ మృదుల, నాయకులు సతీష్, ఉపసర్పంచ్ రఫీ పాల్గొన్నారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి: డీసీఎస్‌ఓ
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రజలు ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలని డీసీఎస్‌ఓ నిత్యానందగౌడ్ తెలిపారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కౌడిపల్లిలో పీహెచ్‌సీలో ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రీకాంత్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ రామారావు, డాక్టర్ ఫెర్నాజ్, సీహెచ్‌ఓ ఎలిజబెత్‌రాణి పాల్గొన్నారు.
వైద్య శిబిరాలను
సద్వినియోగం చేసుకోండి
జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరాం


