కలెక్టర్ ప్రతిమాసింగ్
హవేళిఘణాపూర్(మెదక్): ప్రతీ ఒక్కరు తమ దైనందిన జీవితంలో సమతుల ఆహారం తీసుకోవడం, నియమిత వ్యాయమం చేయడంతో పాటు ప్రజలు శాసీ్త్రయ దృక్పథంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సర్ధన పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య పరీక్షలను చేయించుకున్నారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు, రికార్డులు, వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యం అనేది కేవలం వ్యాధుల లేమి మాత్రమే కాకుండా శారీరక, మానసిక, సామాజిక సంక్షేమం కలిపిన సమగ్ర స్థితి అని తెలిపారు. అలాగే మానసిక ఆరోగ్యాన్ని సమానంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడానికి యోగా వంటి పద్ధతులను అనుసరించాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వినోద, మండల వైద్యాధికారి వినయ్‌సుశీల్, సిబ్బంది కృష్ణ తదితరులు ఉన్నారు.


