విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం: డీఈఓ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం: డీఈఓ

Feb 22 2026 8:22 AM | Updated on Feb 22 2026 8:22 AM

విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం: డీఈఓ

విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం: డీఈఓ

రామాయంపేట(మెదక్‌): రాగి జావ తాగి అస్వస్థతకు గురైన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను శనివారం రాత్రి డీఈఓ విజయ పరామర్శించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు సహించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న మహిళలు జాగ్రత్తగా ఉండాలని, పిల్లలకు పెట్టే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. స్కూల్‌ విద్యార్థులు ట్యాంక్‌లో నిల్వ ఉన్న నీరు తాగుతున్నారని, వారికి మినరల్‌ వాటర్‌ సదుపాయం కల్పించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. ఈవిషయమై తాను రెండు, మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఆమె వెంట తహసీల్దార్‌ రజని, ఎంఈఓ శ్రీనివాస్‌, ఇతర అధికారులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement