ఏకాగ్రతతో చదివితేనే విజయం | - | Sakshi
Sakshi News home page

ఏకాగ్రతతో చదివితేనే విజయం

Feb 22 2026 8:22 AM | Updated on Feb 22 2026 8:22 AM

ఏకాగ్రతతో చదివితేనే విజయం

ఏకాగ్రతతో చదివితేనే విజయం

8లో

సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నాయి పల్లెలు. గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తూ తీర్మానాలు చేస్తున్నారు. ఫలితంగా ఆయా గ్రామాల్లోని మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పల్లెల్లో బెల్ట్‌షాపులు పెరిగిపోవడం.. సంపాదించిన డబ్బంతా మద్యం తాగేందుకే ఖర్చు పెడుతండటంతో కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అవుతున్నాయి. పైగా కుటుంబాల్లో కలహాలు చోటుచేసుకుంటుండటంతో గ్రామ ప్రజలంతా ఏకమై మద్యం నిషేధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

చిన్నశంకరంపేట(మెదక్‌)/మెదక్‌ కలెక్టరేట్‌: పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులు ముందుకుసాగాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శనివారం మండలంలోని సూరారం జెడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థు లు ఏకాగ్రతతో చదివితేనే మెరుగైన ఫలితాలు పొందగలరని చెప్పారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా వినడంతో పాటు ఇంటి వద్ద కూడా కష్టపడి చదివితేనే మంచి మర్కులు వస్తాయన్నారు. ఈసందర్భంగా విద్యార్థుల అభ్యాసన ప్రతిభను పరిశీలించారు. మ్యాథ్స్‌, సైన్స్‌, తెలుగు, ఆంగ్లంపై పట్టు సాధించాలన్నారు. విద్యార్థుల ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ అవసరం అన్నారు. ఈసందర్భంగా హెచ్‌ఎం సాయిరెడ్డి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

పకడ్బందీగా నిర్వహించాలి

పదో తరగతి పరీక్షలు పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పరీక్షకు పరీక్షకు మధ్య సమయం ఎక్కువగా ఉన్నందున మరుసటి రోజు వచ్చే విద్యార్థులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా నుంచి జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు 4 ప్రాజెక్ట్‌లు ఎంపికయ్యాయి. రూపొందించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీఈఓ విజయ, పరీక్షల విభాగం అధికారి కరుణాకర్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, ఎంఈఓ శంకర్‌, గైడ్‌ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

నిమిషం నిబంధన ఎత్తివేత

విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి గంట ముందుగానే చేరుకుంటే మేలు. ఈసారి నిమిషం నిబంధన ఎత్తివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఇంటర్‌ విద్యాశాఖ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. దానిపై కళాశాల ప్రిన్సిపాల్‌ సంతకం లేనప్పటికీ పరీక్షలకు హాజరుకావొచ్చు.

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. జిల్లా పరీక్షల విభాగం, హైపవర్‌ కమిటీతో పాటు చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్‌ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులకు సెల్‌ఫోన్ల అనుమతి లేదు.

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement